Site icon NTV Telugu

RCB vs PBKS: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో..!

War 2 Ipl 2025 Final

War 2 Ipl 2025 Final

టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్‌ 2’. హృతిక్‌ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు మొదలెట్టింది. ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టినరోజు నాడు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేసింది. తాజాగా వార్‌ 2 చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నేడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో వార్‌ 2కు సంబందించిన ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను మ్యాచ్ బ్రేక్‌ల మధ్య టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం. విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Rohit Sharma: నా దగ్గర బ్యాట్‌లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్

పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న వార్‌ 2కు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. వార్‌ 2 ద్వారా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. ఇటీవల తెలుగు, హిందీ, తమిళ్‌ వర్షన్‌లో టీజర్‌ విడుదలైంది. అన్ని భాషల్లో తారకే డబ్బింగ్‌ చెప్పాడు. టీజర్‌ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

Exit mobile version