Site icon NTV Telugu

Jowar Sangati Recipe: తింటే ప్రాణం లేచి రావాల్సిందే! ముద్ద పప్పు లేదా నాటుకోడి పులుసుతో ‘జొన్న సంగటి’..

Jowar Sangati

Jowar Sangati

Jowar Sangati Recipe: నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ (Diabetes) వ్యాధితో బాధపడేవారికి చిరుధాన్యాలు ఒక వరంగా చెప్పవచ్చు. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి గురించి మనందరికీ తెలుసు. కానీ అంతే రుచికరంగా, అంతకంటే ఎక్కువ బలనిచ్చే ‘జొన్న సంగటి’ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Bullet Trains: 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లు.. ఏపీ, తెలంగాణకు భారీ రైల్వే బడ్జెట్!

కావలసిన పదార్థాలు:
జొన్న రవ్వ: 1 కప్పు (మరీ సన్నగా కాకుండా, కొంచెం పలకగా ఉన్నది)
బియ్యం: 1/4 కప్పు (సంగటి మెత్తగా రావడం కోసం)
నీళ్లు: 4 నుండి 5 కప్పులు (రవ్వ రకాన్ని బట్టి)
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: కొద్దిగా (రుచి కోసం)

తయారీ విధానం:
ముందుగా జొన్న రవ్వను, బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 30 నిమిషాల నుండి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సంగటి త్వరగా ఉడుకుతుంది. ముందుగా ఒక మందపాటి గిన్నెలో లేదా కుక్కర్‌లో 4 కప్పుల నీటిని పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. అలా నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం మరియు జొన్న రవ్వను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

ఇలా చేస్తున్నపుడు రవ్వ, బియ్యం పూర్తిగా ఉడికి నీరంతా ఇంకిపోయి మెత్తగా అయిన తర్వాత.. పప్పు గుత్తితో గానీ లేదా గరిటెతో గానీ బాగా ఎనుపుకొవాలి. దీనివల్ల సంగటి ముద్దలాగా బాగా వస్తుంది. ఆ తర్వాత చేతికి కొంచెం నీరు లేదా నెయ్యి రాసుకుని, వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన పరిమాణంలో ముద్దలుగా చుట్టుకోవాలి. అంతే జొన్న సంగటిని వేడివేడిగా ఏదైనా నాటు కోడి పులుసు లేదా వేరుశనగ పప్పుల చట్నీ (పల్లీ చట్నీ) తో తింటే అద్భుతంగా ఉంటుంది. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు.

Jowar Khichdi Recipe: ఎప్పుడూ తినే కిచిడి బోర్ కొట్టిందా? అయితే ఈ ప్రోటీన్ రిచ్ ‘జొన్న కిచిడి’ ట్రై చేయండి!

ఆరోగ్య ప్రయోజనాలు:
జొన్నల్లో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇంకా దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల పుష్టికి ఎంతో మేలు చేస్తాయి.

Exit mobile version