Jowar Khichdi Recipe: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ ‘జొన్నలు’ అందించే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లో బెస్ట్ ఏది.?
కావలసిన పదార్థాలు:
* జొన్న రవ్వ: 1 కప్పు (నానబెట్టినది)
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
* పోపు దినుసులు: జీలకర్ర (1 టీస్పూన్), లవంగాలు (4-5), దాల్చిన చెక్క (1 అంగుళం), బిర్యానీ ఆకు (1),
* కూరగాయలు: పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు,
* పప్పు: పెసరపప్పు (1/4 కప్పు – 4 గంటలు నానబెట్టినది),
* పసుపు (1/2 టీస్పూన్),
* సైంధవ లవణం (రుచికి సరిపడా),
* నీళ్లు (3 కప్పులు).
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి తక్కువ మంట మీద వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి, మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు మెంటర్‌గా దినేశ్ కార్తిక్.. వాటే లక్కీ ఛాన్స్!
ఆ తర్వాత ఇందులో 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన జొన్న రవ్వను వేసి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద 15 నుండి 20 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న కిచిడి సిద్ధం అవుతుంది. జొన్న కిచిడిలోకి కీరదోస రైతా అద్భుతమైన కాంబినేషన్ గా ఉంటుంది. దీని కోసం పెరుగులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, సైంధవ లవణం, తురిమిన కీరదోస, కొత్తిమీర కలిపి తయారు చేసుకోవచ్చు.
ఈ ‘జొన్న కిచిడి’ బరువు తగ్గడానికి (Weight Loss) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక పోషకమైన ఆహారం. కాబట్టి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు ఈ కిచిడి తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
