Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Biscuit Recipe: సాధారణంగా బిస్కెట్లు అంటే మైదా పిండితో చేస్తారని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పిండితో కూడా ఎంతో రుచికరమైన, క్రంచీ బిస్కెట్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ జొన్న బిస్కెట్స్ (Jowar Atta Biscuits) ఎలా చేయాలో ఇప్పుడు చేసేద్దాం.
అవసరమైన పదార్థాలు:
* జొన్న పిండి: 1 కప్పు.
* పంచదార పొడి: అర కప్పు.
* వెన్న (Butter) లేదా కొబ్బరి నూనె: 3 టేబుల్ స్పూన్లు.
* యాలకుల పొడి లేదా వనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్.
* బేకింగ్ పౌడర్: పావు టీస్పూన్.
* పాలు: పిండి కలపడానికి తగినన్ని.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి, పంచదార పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వెన్న లేదా కొబ్బరి నూనె వేసి పిండికి బాగా పట్టించాలి. అవసరమైతే కొద్దిగా పాలు పోస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బిస్కెట్ల మాదిరిగా ఒత్తుకోవాలి. వాటిని మీకు నచ్చిన ఆకారంలో వీటిని తయారు చేసుకోవచ్చు.
ఓవెన్ లేకపోయినా వీటిని చేసుకోవచ్చు. ఒక మందపాటి గిన్నెలో ఉప్పు వేసి, దానిపై ఒక స్టాండ్ ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి.. అందులో సిద్ధం చేసుకున్న బిస్కెట్లను అందులో అమర్చాలి. ఈ ప్లేట్‌ను వేడి చేసిన గిన్నెలో స్టాండ్‌పై ఉంచి, మూత పెట్టి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు తక్కువ మంట మీద బేక్ చేయాలి. అలా బిస్కెట్లు మంచి రంగులోకి వచ్చిన తర్వాత బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఇవి కాస్త మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత ఎంతో కరకరలాడుతూ రుచిగా మారుతాయి.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!