Site icon NTV Telugu

Journey Of Love 18 Plus : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ టీనేజ్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎక్కడ చూడాలంటే?

Whatsapp Image 2023 09 18 At 8.31.31 Pm

Whatsapp Image 2023 09 18 At 8.31.31 Pm

ఇటీవల మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మలయాళ దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది.గతంలో విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్‌, పద్మిని వంటి సినిమా లు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి. ఇప్పుడు మరో మలయాళ సూపర్‌హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’.

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 7వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టింది. అక్కడి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇప్పుడీ టీనేజ్ లవ్‌ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ సోనీ లివ్‌లో ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’ స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషల్లో కూడా ఈ టీనేజ్‌ లవ్‌ స్టోరీ అందుబాటులో ఉంది.అరుణ్ డి. జోస్ తెరకెక్కించిన జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ లో నస్లెన్ కె. గఫూర్, మాథ్యూ థామస్, మీనాక్షి దినేష్, నిఖిల విమల్, బిను పప్పు, రాజేష్ మాధవన్ వంటి వారు నటించారు. వీరంతా మలయాళ నటులే కావడం విశేషం.. అయితే ఈ సినిమా లో కథ మరియు స్క్రీన్‌ప్లేనే కీ రోల్‌ పోషించాయి. నేటి యూత్‌ ఆలోచనలకు తగ్గట్టుగా ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించారు. ఫలూదా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనుమోద్ బోస్ ఈ లవ్ స్టోరీ ని నిర్మించారు. క్రిస్టో జేవియర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.మరి ఈ టీనేజ్ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుందో చూడాలి.

Exit mobile version