Joseph Rajesh Success Story: నువ్వు ఎట్ల పుట్టావు అనేది ముఖ్యం కాదు.. ఎలా చనిపోతావు అనేది ముఖ్యం. పేదరికంలో పుట్టినా.. స్థితిమంతుడిగానే చావాలనే ఓ ఫేమస్ సినిమా డైలాగ్‌తో ఈ స్టోరీకి కచ్చితంగా సూటబుల్ అవుతుంది. డైలాగ్‌కు ఈ స్టోరీకి దగ్గరి సంబంధం ఉంది. ఆయనో పేద కుటుంబంలో పుట్టాడు. అయితేనేం కష్టపడి పట్టుదలతో చదువుకున్నాడు. తన పేదరికాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో తొలి మజిలీగా బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించాడు. అక్కడితో ఆయన ఆగిపోతే ఈ రోజు తన కథను మనం చదువుకోవాల్సి వచ్చేది కాదు. నిజంగా ఆయన ఆ రోజు అక్కడితో ఆగిపోలేదు. ముందుకు వెళ్లాలనుకొని.. ఉన్న చోటున కూర్చోకుండా నిలబడి తనదైన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే కోట్లకు అధిపతిగా నిలిచి నలుగురితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన తన ప్రయత్నంలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎంటువంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, ఆయన విజయానికి ఎన్ని అవరోధాలను దాటుకొని గెలుపు ముంగిటకు వెళ్లి నిలుచున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Top Headlines @5PM : టాప్ న్యూస్
మొదటి ప్రయత్నం..
జోసెఫ్ రాజేష్ కరూర్ జిల్లాలోని మోచకోట్టం పాలయం అనే చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఓ సాధారణ కుటుంబంలో పుట్టారు. ఆయనకు తన చిన్నతనంలోనే అర్థం అయ్యింది.. ఇక్కడ ఆగిపోతే జీవితం గడపడం ఎంత కష్టం అవుతుందో అని. దీంతో ఆయన పేదరికంపై కసితో కష్టపడి చదవడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆయన జీవితంలో తొలి గెలుపును రుచి చూసిన మొదటి సందర్భం ఎదురైంది.. అదే తనకు బ్యాంకులో ఉద్యోగం రావడం. ఆయన అక్కడితో ఆగిపోలేదు. వచ్చిన దాంతో సంతృప్తి చెంది.. ఇక కష్టపడాల్సిన అవసరం లేదనుకొని, అక్కడే ఆగిపోతే అసలు ఈ కథ లేనే లేదు. అక్కడ తీసుకున్నాడు ఆయన ఓ నిర్ణయాన్ని.. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి తానే నలుగురికి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచనతో అడుగు ముందుకు వేశాడు. ఆలోచనతోనే ఆగిపోతే ఆశయం నెరవేది ఎప్పుడు.. అందుకు ఆలోచన దగ్గర ఆగిపోయిన దానిని ఆచరణలోకి తీసుకురాడానికి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తాడోపేడో తేల్చుకోడానికి రంగంలోకి దిగాడు.
రూ.50 వేలతో ప్రారంభం..
ఆయన వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఆ వైపుగా కదిలాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి 2017లో చెన్నైలో రూ.50 వేల పెట్టుబడితో ఓ టీకొట్టును ప్రారంభించాడు. కట్ చేస్తే అది నేడు బ్లాక్ పెకోయ్ అనే బ్రాండ్ నేమ్‌తో ఈ రోజు తమిళనాడులో 78 టీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి సక్సెస్ పుల్‌గా రన్ అవుతోంది. ఈ విజయంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆ పట్టుదలే నేటి విజయానికి కారణంగా నిలిచి ఆయనను కోటీశ్వరుడిని చేసింది. ఆయన
2017లో చెన్నైలోని వేలచేరిలోని గ్రాండ్ మాల్‌లో కేవలం 100 చదరపు అడుగుల స్థలంలో బ్లాక్ పెకో అనే టీ దుకాణాన్ని ప్రారంభించాడు. మొదటి రోజు నుండే దీనికి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. టీ రుచి, ఆయన ప్రవేశపెట్టిన స్నాక్ ఐటమ్స్ షాప్‌కు వచ్చే కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కసారి జనాల్లో షాపుకు మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత ఆయన రోజుకు తన దుకాణంలో రూ.8 వేల అమ్మకాలు చేయడం ప్రారంభించానని చెప్పారు.
ధైర్యం చేసి మరింత ముందుకు..
అమ్మకాలు పెరగడంతో చెన్నైలోని అలందూర్‌లో రూ.20 లక్షల పెట్టుబడితో బ్లాక్ పెకో శాఖను ఏర్పాటు చేశాడు. కానీ పార్కింగ్ సమస్యల కారణంగా కేవలం నాలుగు నెలల్లోనే దానిని మూసివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన తన ధైర్యం కోల్పోలేదు. అనంతరం కాలంలో రూ.3 లక్షల పెట్టుబడితో రామానుజన్ సిటీ, OMRలో మూడవ అవుట్‌లెట్‌ను ప్రారంభించాడు. ఇక్కడ టర్న్ అయ్యింది బాస్ మనోడి అదృష్టం. ఇక్కడ తెరిచిన అవుట్‌లెట్ సక్సెస్ కావడంతో దెబ్బకు చిన్న దుకాణం నుంచి ఇప్పుడు బిగ్ బిలియన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీగా ఎదిగింది.
వీళ్ల షాపులో ఒక టీ ధర రూ.10 నుంచి రూ.30 వరకు ఉంటుంది. వాళ్లు అల్లం టీ, మసాలా టీ, ఏలకులు టీ, నిమ్మ టీ, అల్లం టీ వంటి వివిధ రకాల టీలను అమ్ముతారు. వారు ఎగ్ పఫ్స్, పనీర్ పఫ్స్, చికెన్ పఫ్స్, బనానా కేక్ వంటి స్నాక్స్ కూడా అమ్ముతారు. ఇప్పుడు బ్లాక్ పెకో, టీ బాయ్ బ్రాండ్లకు చెందిన 78 అవుట్‌లెట్‌లు తమిళనాడు రాష్ట్రం అంతటా పనిచేస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ కంపెనీ రూ.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. త్వరలో రూ.10 కోట్ల ఆదాయం కలిగిన కంపెనీగా ఎదుగుతుందని జోసెఫ్ రాజేష్ నమ్మకంగా చెప్తున్నారు. ఆయన సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గృహిణులుగా జీవితంలో విజయం సాధించాలనుకునే వారికి ప్రత్యేక డిస్కౌంట్లతో ఫ్రాంచైజీలను అందించాడు. ఇప్పటి వరకు 13 మంది మహిళలకు ఆయన నుంచి ఫ్రాంచైజీలు ఇచ్చినట్లు చెప్పారు. ఫ్రాంచైజీలు తీసుకున్న మహిళలు ఇప్పుడు నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోసెఫ్ రాజేష్ విజయం ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.
READ ALSO: PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..
