Site icon NTV Telugu

Jonty Rhodes : వారెవ్వా జాంటీ రోడ్స్.. నీకు సలాం

Janty Roods

Janty Roods

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆయన పేరు వినగానే సంచలన క్యాచ్ లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్ ఫీల్డింగ్ తో ఎన్నోసార్లు దక్షిణాఫ్రికా గెలిచింది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ గా మారిన జాంటీ రోడ్స్ తన మార్క్ ను చూపిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.

Also Read : Cyber Crime: మహిళలే టార్గెట్‌.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!

అయితే జాంటీ రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తే పిచ్ పై కవర్లను కప్పడం మనం చూస్తాం.. కానీ ఆ కవర్లు లాగడానికి గ్రౌండ్స్ మెన్ చాలా కష్టపడతారు. చాలా బరువుండే దానికి గ్రౌండ్ లోకి తీసుకురావడం కత్తిమీద సామే.. అలాంటి కష్టం తెలిసి వ్యక్తి జాంటీరోడ్స్ గ్రౌండ్స్ మెన్ కు తనవంత సహాయం చేశాడు.

Also Read : India at UN: ఆ 5 దేశాలు అన్ని దేశాల కన్నా ఎక్కువా..? యూఎన్ఎస్‌సీ నిర్మాణంపై భారత్

బుధవారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. లక్నో ఇన్సింగ్స్ సమయంలో వర్షం రావడంతో గ్రౌండ్ సిబ్బంది రెయిన్ టర్పైన్ కవర్లతో గ్రౌండ్ లోకి వస్తున్నారు. ఇది గమనించిన జాంటీ రోడ్స్ వారితో పాటు కవర్ ను లాగేందుకు యత్నించాడు. సిబ్బంది వద్దని వారించినా రోడ్స్ వినిపించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వద్దు సార్.. మేం చూసుకుంటాం.. అనగానే రోడ్జ్ అక్కడ నుంచి కొద్దీ దూరం వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి ఆ కవర్ ను లాగడం మనం చూడవచ్చు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Exit mobile version