Site icon NTV Telugu

Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..

Jonathan Trott.jpg1

Jonathan Trott.jpg1

Jonathan Trott: అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. టీమ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్‌తో నాలుగేళ్ల అనుబంధానికి కోచ్ జోనాథన్ ట్రాట్ ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గాన్ టీమ్‌కు కోచ్‌గా ఉండే అవకాశం తన జీవితంలో అత్యంత విలువైనదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. మొదట ఈ బాధ్యత గ్రాహమ్ థోర్ప్‌కు తీసుకోవాల్సి ఉండేది. కానీ.. కొన్ని కారణాల వల్ల బాధ్యతలు స్వీకరించలేపోయారు. అప్పుడు ట్రాట్‌కు ఈ అవకాశం వచ్చింది. తనకు ఈ అవకాశం అనుకోకుండా వచ్చినదేనని.. కానీ దాన్ని నా సవాలుగా తీసుకుని తన వంతు కృషి చేశానని జోనాథన్ ట్రాట్ అన్నారు. ఆటగాళ్లపై తనకు ఉన్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. ప్లేయర్స్ ఎదుగుదలే తనకు పెద్ద సంతృప్తి అని చెప్పారు.

READ MORE: Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌ పార్టీలోకి ఓపీఎస్.!

ఈ టీమ్‌తో గడిపిన రోజులు కేవలం మ్యాచ్‌లకే పరిమితం కాలేదని జోనాథన్ ట్రాట్ భావోద్వేగంగా వివరించారు. మైదానంలో రాణించడం ఒక భాగమే.. కానీ సాధారణ ఫ్యామిలీస్‌ నుంచి వచ్చిన యువకులు తమ కుటుంబాల భవిష్యత్తును మార్చుకునే స్థాయికి ఎదగడం తనకు నిజమైన గెలుపు అనిపించిందని చెప్పారు. తాను బాధ్యత తీసుకున్నప్పుడు బాలుడిగా ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో యువకులుగా ఎదగడం తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభవమని అన్నారు. ఇదిలా ఉండగా.. ట్రాట్ కోచ్‌గా ఉన్న సమయంలో అఫ్గానిస్థాన్ వైట్‌బాల్ క్రికెట్‌లో కొత్త శక్తిగా ఎదిగింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు దగ్గరగా చేర..… 2024 టీ20 వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశలోకి ప్రవేశించడంలో ఆయన పాత్ర మరవలేనిది. తాజాగా కెనడాపై 82 పరుగుల విజయంతో టోర్నీని ముగించిన అనంతరం.. కోచ్ తన చివరి రోజు సందర్భంగా మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి.

READ MORE: Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!

Exit mobile version