Site icon NTV Telugu

Oscar Awards 2024 John Cena : ఆస్కార్ స్టేజ్ పై జాన్ సీనా న్యూడ్ షో.. వైరల్ అవుతున్న వీడియో..

Whatsapp Image 2024 03 11 At 8.13.24 Am

Whatsapp Image 2024 03 11 At 8.13.24 Am

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే  సినీ అవార్డ్స్ ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్..ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది.అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ అయిన జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనాకు దక్కింది. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి అతని పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు..ఆ ఘటన చూసి స్టేజ్ కింద ఉన్న వాళ్లు తెగ నవ్వుకున్నారు. దీనికి కారణం జాన్ సీనా అసలు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా రావడం.తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా  అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకొని వచ్చాడు.

సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిసింది అనే తన కామెంట్ తో జాన్ సీనా మరోసారి అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత మరో వ్యక్త వచ్చి ఈ అవార్డు నామినీల జాబితాను అనౌన్స్ చేశాడు. ఈ అవార్డు కోసం బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓపెన్‌హైమర్ మరియు పూర్ థింగ్స్ నిలిచాయి.నామినీల వీడియోను బిగ్ స్క్రీన్ పై ప్లే చేస్తుండగానే జాన్ సీనా స్టేజ్ పైనే డ్రెస్ వేసుకోవడం విశేషం. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డుల నామినీల వీడియోలు ప్లే చేసే సమయంలో స్టేజ్ పై లైట్లన్నీ ఆర్పేశారు. ఆ సమయంలో నలుగురైదుగురు వ్యక్తులు వేగంగా వచ్చి జాన్ సీనాకు ఓ డ్రెస్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు విజేతను అనౌన్స్ చేశాడు.ఈ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు పూర్ థింగ్స్ సినిమాకు వచ్చింది.. అయితే కోట్లాది మంది చూసే వేడుక స్టేజ్ పైకి ఓ స్టార్ రెజ్లర్ ఇలా న్యూడ్ గా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇదేంటి.. అతడు ఇలా చేశాడంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Exit mobile version