Site icon NTV Telugu

Jogi Ramesh : చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న..

Jogi Ramesh

Jogi Ramesh

చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్ళాడో.. ఎక్కడికి వెళ్ళాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి..? అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లాడుకనుకే ఇంత రహస్యమన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?.

 

ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. ఏబీ వెంకటేశ్వరావు టీడీపీ తొత్తు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. పరికరాల కొనుకోలు స్కాం లో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా abv పాత్ర ఉందని నిర్ధారించిందని, ఏబీ వెంకటేశ్వరావు ఒంటిపై బట్టలు మాత్రమే ఖాకీ.. లోపల అంతా యెల్లో నే అని ఆయన అన్నారు. ఏబీ వెంకటేశ్వరావు చరిత్ర ప్రజలకు తెలుసు.. నిన్నటితో మరింతగా నిజస్వరూపం బయటపడిందన్నారు. ఎగ్జిట్‌ పోల్స్ తో కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతుందని, జూన్ 4 తేదిన చంద్రబాబుకి మూర్చ వచ్చి హాస్పిటల్ లో చేరడం తథ్యమన్నారు. వైసిపి మళ్ళీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని, వైసీపీ శ్రేణులంతా సంబరాలకు సిద్దం అవ్వండన్నారు మంత్రి జోగి రమేష్‌.

 

Exit mobile version