గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. నేను కూడా పెడనలోనే ఉండాలని అనుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి జగన్ నేను పెడన నుంచి పోటీ చేయాలా వేరే చోటు నుంచి చేయాలా నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ అన్నారు. ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే వద్దని కొందరు, ఎమ్మెల్యే కావాలని కొందరు అడగటం ప్రతి పార్టీలో ఉంటుందన్నారు.
లీడర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. లీడర్ నిర్ణయానికి అందరం కట్టుబడాల్సిందేనని, సీటు – పోటీ విషయంలో పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం అని ఆయన వెల్లడించారు. సంత విషయంపై మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. నాకు పార్టీలో ఎవరితో శతృత్వం లేదు, అందరూ మిత్రులేనని ఆయన అన్నారు. నేను శత్రువని ఎవరైనా అనుకుంటే వాళ్ళే తప్పు చేసినట్టు లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఏ తప్పూ చేయలేదని, నేను ఈ పార్టీలో ఉండి పక్క చూపులు చూడలేదన్నారు. నేను వైసీపీ జెండా మోసాను, ఏ తప్పటడుగు వేయలేదన్నారు.