NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్ 2024కు స్టార్ బౌల‌ర్ దూరం!

Jofra Archer will not be part of the 2024 IPL auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు సంబదించిన వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రో రెండు వారాల్లో మొద‌ల‌య్యే మినీ వేలంలో స్టార్ ప్లేయ‌ర్ల‌ను కొన‌డంపై భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. అయితే కొంద‌రు స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2024కు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 నుంచి వైదొల‌గాల‌ని జోఫ్రా ఆర్చ‌ర్‌ను ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరిందట. వ‌చ్చే ఏడాది టీ20 ప్రపంచక‌ప్ ఉన్నందున వ‌ర్క్‌లోడ్ ప‌డ‌కుండా ఉండేందుకు.. ఐపీఎల్ ఆడొద్ద‌ని అతడికి సూచిందట. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే.. టీ20 ప్రపంచక‌ప్ ఉన్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుందట. అయితే ఈ విష‌యంపై ఆర్చ‌ర్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఆర్చ‌ర్ ఆడకపోతే.. ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్ అనే చెప్ప్పాలి.

Also Read: IND vs AUS: 10 పరుగులే చేసినా.. రికార్డు సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్!

2018 ఎడిష‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జోఫ్రా ఆర్చ‌ర్‌ను కొనుగోలు చేసింది. ఆ ఎడిష‌న్‌లో ఆర్చ‌ర్‌ అద్భుతంగా రాణించాడు. దాంతో 2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో సూప‌ర్ ఓవ‌ర్‌లో ఆర్చ‌ర్ సంచ‌ల‌న బౌలింగ్‌తో తన జట్టును విజేత‌గా నిలిపాడు. దాంతో అత‌డు స్టార్ అయిపోయాడు. 2022 మినీ వేలంలో ఆర్చ‌ర్‌ను రూ. 10 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ ద‌క్కించుకుంది. అయితే గాయం కార‌ణంగా టోర్నీ మ‌ధ్య‌లోనే స్వదేశం వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2023 కూడా ఆడలేదు. ఈ మ‌ధ్యే కోలుకున్న ఆర్చ‌ర్.. వ‌చ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న‌టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇంగ్లండ్‌కు కీల‌కం కానున్నాడు. అందుకే ఐపీఎల్ ఆడొద్దని సూచిందింది.