Site icon NTV Telugu

Joe Root: ‘బజ్‌బాల్‌’ సరికాదేమో.. ఇండియా సిరీస్‌కు ముందు జో రూట్ కీలక వ్యాఖ్యలు..!

Joe Root

Joe Root

Joe Root: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‌లో అమలు చేస్తున్న ‘బజ్‌బాల్’ విధానం గురించి తాజాగా స్పందించారు. 2022లో బ్రెండన్ మెక్‌కలమ్ ప్రధాన కోచ్‌గా నియమితులైన తర్వాత, కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి టీమ్‌కు ఒక కొత్త దిశను సూచించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రూట్ మాట్లాడుతూ.. “బజ్‌బాల్” అనేది సరైన పదం కాదేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Israel Iran War: డేంజర్‌లో ఇజ్రాయిల్.. బలహీనంగా ఎయిర్ డిఫెన్స్.. మరో 10 రోజులకు మాత్రమే క్షిపణులు

ఈ విషయంపై రూట్ మాట్లాడుతూ.. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ నా కోసం ఎంతో చేశాడు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నా. మళ్లీ ఆటగాడిగా జట్టులోకి రావడం కాస్త అసహజంగా అనిపించింది. కానీ అతనికి నా మద్దతు ఉన్నట్టు తెలియజేయాలనుకున్నాను అని అన్నారు. నిజానికి పరుగులు చేయడం ద్వారా గేమ్‌ను ప్రభావితం చేయాలనుకున్నాను. మాజీ కెప్టెన్‌గా, ఇప్పుడు స్టోక్స్ నాయకత్వంలో ఆడుతున్నప్పుడు నా ప్రదర్శన నూతనంగా జట్టులోకి వచ్చిన వారికి ధైర్యాన్ని ఇస్తుంది అని రూట్ వివరించారు.

Read Also: Cyber Fraud : ఫేస్‌బుక్ మోసం.. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి రూ.38 లక్షల చీటింగ్

ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం అమలు చేస్తున్న బజ్ బాల్ ఆట శైలి గురించి రూట్ మాట్లాడుతూ.. ఇది నా కెరీర్‌లో అత్యంత ఆనందకరమైన సమయం. జట్టులోని వాతావరణం ఎంతో సరదాగా మారింది. స్టోక్స్, మెక్‌కలమ్ చేసిన పని గొప్పది. కానీ, బజ్‌బాల్ అనే పదం కాస్త తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇది సాధారణంగా భావించే దానికంటే చాలా స్పీడ్ గా ఉన్న విధానం అని పేర్కొన్నారు.

Exit mobile version