NTV Telugu Site icon

US-UK: హౌతీ తిరుగుబాటుదారులపై దాడి.. జో బైడెన్, రిషి సునాక్ రియాక్షన్ ఇదే..!

Us Uk

Us Uk

Houthi rebels: యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించిన స్థావరాలపై అమెరికా- బ్రిటన్ దళాలు బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో హౌతీ రెబల్స్ కు సంబంధించిన పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల నిల్వలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారులు సమాచారం అందించారు. ఇక, ఎర్ర సముద్రంపై తీవ్రవాద గ్రూపులపై దాడులను అమెరికా, దాని మిత్రదేశాలు సహించబోవని తెలియజేసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అమెరికా దాని మిత్రదేశాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ చర్య తీసుకున్నాయన్నారు. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ షిప్పింగ్‌పై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ హౌతీ రెబల్స్ దాడుల వల్ల అమెరికన్ సిబ్బంది, పౌరులతో పాటు మా భాగస్వాములు ప్రమాదంలో పడ్డారు.. వాణిజ్యం ప్రమాదంలో పడింది, నావిగేషన్ స్వేచ్ఛ ప్రమాదంలో పడింది అని జో బైడెన్ చెప్పుకొచ్చారు.

Read Also: Infosys-TCS Update: టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల్లో 11,961 ఉద్యోగాల కోత

అలాగే, హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే సైనిక స్థావరాలపై రాయల్ వైమానిక దళం లక్షిత దాడులు చేసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓ ప్రకటన విడుదల చేశారు. యెమెన్ రాజధాని సనాలో ఇవాళ తెల్లవారుజామున నాలుగు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ ఓడరేవు ప్రాంతంలో ఐదు భారీ పేలుళ్లు సంబవించినట్లు తెలిపారు. ఈ ఓడరేవు నగరం హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఇప్పటి వరకు ఉన్నదని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ వెల్లడించారు. వాణిజ్యానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.