Joe Biden: బైడెన్ మరోసారి వింత ప్రవర్తన.. ఒబామా ఏం చేశారంటే..!

  • స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన బైడెన్‌
  • చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!
  • వీడియో వైరల్.. ఆరోగ్యంపై నెట్టింట చర్చ
Obma

Obma

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి వింతగా ప్రవర్తించారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ 7 సదస్సులో ఆయన ప్రవర్తన వైరల్ అయింది. అందరూ ఒక వైపు ఉంటే.. ఆయన ఇంకోవైపు చూస్తూ ఉండిపోయారు. అంతేకాకుండా ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన ఉత్సవ విగ్రహంలా ఉండి పోయారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది.

ఇది కూడా చదవండి: MP CM RAMESH: “రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు”

ఆరోగ్యం, వయోభార సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన పలుసార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారితప్పడం, గందగరోళ చూపులు, స్టేజీపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు.

ఇది కూడా చదవండి: Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!

లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం డెమోక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బైడెన్‌, ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్‌ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్‌ను మార్మోగించారు. దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదిలారు. బైడెన్‌ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు.