NTV Telugu Site icon

Joe Biden: జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి.. వీడియో వైరల్

Jeobiden

Jeobiden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌హౌస్ జునెటీన్త్ వేడుకల్లో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సంగీతం, నృత్యాలతో ఎంజాయ్ చేస్తుంటే.. బైడెన్ మాత్రం దిష్టి బొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు. 20 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అధ్యక్షుడు ఏ మాత్రం స్పందించలేదు. కానీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం చుట్టూ ఉన్న వారితో కలిసి సంగీతానికి తగినట్టుగా డ్యాన్స్ చేసింది.

ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..

బైడెన్ పక్కన నిలబడి ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్.. అధ్యక్షుడి భుజంపై చేయి వేసి ప్రోత్సహించాడు. అయినా కూడా స్పందించలేదు. అలానే కదలకుండా ఉత్సవ విగ్రహంలా ఉన్నారు. బిడెన్ ప్రసంగానికి ముందు ఈ సంఘటన జరిగింది.

ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్లజాతి ఓటర్లను ఆకర్షించేందుకు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతి ఓటర్లే కీలకం. 2020లో బైడెన్ 91 శాతం నల్లజాతి ఓట్లను సొంతం చేసుకున్నారు. దీంతో వైట్‌‌హౌస్‌లో జూన్‌టీన్త్ వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే 2021లో బైడెన్ జూన్ 19న జూన్‌టీన్త్‌ను ఫెడరల్ సెలవుదినంగా ప్రకటిస్తూ చట్టంపై సంతకం చేశారు. 1865లో యునైటెడ్ స్టేట్స్‌లోని చివరి బానిసలుగా ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛను గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: Amritpal Singh: ఖలిస్తానీ అమృ‌త్‌పాల్ సింగ్‌ని జైలు నుంచి విడుదల చేయాలి.. కమలా హారిస్‌ని కోరిన సిక్కు లాయర్..

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఊహించిన రిపబ్లికన్ అభ్యర్థి, ఎక్కువ మంది నల్లజాతి ఓటర్లు ఇప్పుడు తనకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. నల్లజాతి అమెరికన్లు నిలకడగా డెమొక్రాటిక్‌కు ఓటు వేసినప్పటికీ, రాజకీయ విధేయతలలో చిన్న మార్పులు లేదా కీలక రాష్ట్రాలలో తక్కువ ఓటింగ్ నవంబర్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. ఇదిలా ఉంటే 2021లో బిడెన్ జూన్ 19న జూన్‌టీన్త్‌ను ఫెడరల్ సెలవుదినంగా ప్రకటిస్తూ చట్టంపై సంతకం చేశారు. 1865లో యునైటెడ్ స్టేట్స్‌లోని చివరి బానిసలుగా ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛను గుర్తుచేసుకుంటూ వేడుక జరుపుకుంటారు.