Israel–Hamas war: ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చిన బాంబుల వల్ల గాజాలో అమాయక పాలస్తీనియన్లు మరణించారని జో బైడెన్ అంగీకరించాడు. గాజాలో పౌరులను చంపిన భారీ బాంబులు యూఎస్ నుంచి ఇజ్రాయెల్‌కు అందించామన్నారు. అందుకే మేము ఇకపై ఇజ్రాయెల్ రఫాపై దాడికి ప్లాన్ చేసే ముందు ఆయుధాలను సరఫరా చేయకూడదని అనుకుంటున్నామన్నారు. అయితే, ఇజ్రాయెల్ భద్రత కోసం తాము ఎప్పటికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ కి ఇప్పటికే ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్‌సెప్టర్లను అందించామని పేర్కొనింది. కానీ, ఇజ్రాయెల్ రఫాపై దాడి చేస్తే మాత్రం ఆ దేశానికి మళ్లీ ఆయుధాలు ఇవ్వమని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.
Read Also: Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?
కాగా, గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ భయంకరమైన దాడిలో 1200 మందికి పైగా ప్రజలు మరణించాగా, 250 మంది బందీలుగా చేసింది. ఇప్పటికి కూడా 50 మందికి పైగా ప్రజలు హమాస్‌తో బందీలుగా కొనసాగుతున్నారు. దీనికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులు చేసింది. అప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశాలు మద్దతు పలికాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 35 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే, కాకుండా రష్యా, చైనా లాంటి శక్తులు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వలేదు.. అలాంటి పరిస్థితిలో అమెరికా కూడా వెనుక తగ్గినట్లు కనిపిస్తుంది.
Read Also: Rashmika Mandanna : నేషనల్ క్రషా.. మజాకా..
రఫాపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. కాగా, బెంజమిన్ నెతన్యాహు మాత్రం తాను ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నానని.. దీని కోసం తాను ఎవరిపైనా ఆధారపడనని చెప్పారు. హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇద్దరూ ముఖాముఖికి పోటీ పడుతున్నారు.