Site icon NTV Telugu

IPPB Recruitment : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం లక్షల్లో..

Postl

Postl

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 54 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు మే 24 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు.. 54

ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్) – 28 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్)- 21 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)- 5 పోస్టులు

అర్హతలు..

బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి..

వయోపరిమితి..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి వయసు 22- 45 ఏళ్లకు మించరాదు..

జీతం..

ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000;
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000;
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 వేతనం ఉంటుంది…

దరఖాస్తు ఫీజు..

రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకైతే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు అధికార వెబ్ సైట్ లో ఆన్లైన్లో మే 24 లోపు అప్లై చేసుకోవాలి..

Exit mobile version