Site icon NTV Telugu

BOB IT Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. అర్హత, శాలరీ పూర్తి వివరాలివే

Bank Of Baroda

Bank Of Baroda

దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ తో ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో తెలియక ఒకింత భయానికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ జాబ్ కంటే ప్రభుత్వ ఉద్యోగం మేలని యువత భావిస్తున్నారు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ విభాగం సీనియర్ మేనేజర్ డెవలపర్, ఆఫీసర్, మేనేజర్ ఇంజనీర్ వంటి వివిధ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 418 పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 19, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.

Also Read:Viral Video: గర్ల్‌ ఫ్రెండ్‌తో పేరెంట్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు BE, BTech, MTech, లేదా ME డిగ్రీ, ఇతర అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి. వారికి కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం కూడా ఉండాలి. కనీస వయస్సు వరుసగా 22, 24, 27 సంవత్సరాలు. ఇంకా, గరిష్ట వయస్సు వరుసగా 32, 34, 37 సంవత్సరాలు. అయితే, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు లభిస్తుంది.

రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి. జనరల్, EWS, OBC అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, SC/ST, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుండి 225 మార్కుల వెయిటేజ్ ఉన్న 150 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉండవు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Valentines Day 2026: ప్రేమికులకు బంపర్ వీకెండ్.. ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ ట్రై చేయండి..మీ పార్ట్నర్ ఫిదా అవ్వాల్సిందే!

శాలరీ వివరాలు

జేఎంజీ/ఎస్-I (అధికారి) రూ. 48,480 – 2,000 – 62,480 – 2,340 – 67,160 – 2,680 – 85,920
ఎంఎంజీ/ఎస్-II (మేనేజర్) రూ. 64,820 – 2,340 – 67,160 – 2,680 – 93,960
ఎంఎంజీ/ఎస్-III (సీనియర్ మేనేజర్) రూ. 85,920 – 2,680 – 99,320 – 2,980 – 1,05,280

Exit mobile version