Site icon NTV Telugu

JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!

Jntuh

Jntuh

JNTU-H: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) అనుబంధ కళాశాలల కోసం 2025–26 విద్యా సంవత్సరానికి అమలులోకి రాబోయే R25 అకడమిక్ నిబంధనలపై బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల కోసం అనేక ఆధునిక, సౌలభ్యవంతమైన మార్పులను జేఎన్టీయూహెచ్ పరిశీలించి నిరన్యం తీసుకుంది. ఈ నిబంధనలు స్వయంప్రతిపత్తి లేని అనుబంధ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులపై వర్తించనున్నాయి.

R25 నిబంధనల ప్రకారం, B.Tech ప్రోగ్రాం కోసం మొత్తం 164 క్రెడిట్లు అవసరం. అయితే ఉత్తమంగా ప్రదర్శించిన 160 క్రెడిట్ల ఆధారంగా CGPA లెక్క చేయబడుతుంది. విద్యార్థులు తక్కువ గ్రేడ్ పొందిన లేదా ఫెయిల్ అయిన సబ్జెక్టులలోంచి ల్యాబ్‌లు, సెమినార్‌లు, ప్రాజెక్ట్‌లు లేదా ఇంటర్న్‌షిప్‌లను మినహాయించి 4 క్రెడిట్‌ల వరకు డ్రాప్ చేయవచ్చు. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు కీలకమైన మార్పుగా పరిగణించబడుతోంది.

Read Also:RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!

ఇక రెండవ, మూడవ సంవత్సరాల్లో విద్యార్థులు నాలుగు 1-క్రెడిట్ నైపుణ్య కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో మూడు డొమైన్-నిర్దిష్ట కోర్సులు ఇంకా ఒక ఇంటర్-డిసిప్లినరీ కోర్సు ఉండేలా 2+2 పద్ధతిలో నిర్మించబడ్డాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా, ఇవి ల్యాబ్ కోర్సుల తరహాలోనే ప్రాక్టికల్ మూల్యాంకనంతో నిర్వహించబడతాయి.

విద్యార్థులు అన్ని కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. రెండవ సంవత్సరం ముగింపు నాటికి 6 వారాల వృత్తిపరమైన కోర్సు లేదా ఇంటర్న్‌షిప్‌తో కలిపి 2 అదనపు క్రెడిట్లు సంపాదించి డిగ్రీ కోర్సు నుంచి నిష్క్రమించవచ్చు. అనంతరం వారు మూడవ సంవత్సరం ప్రారంభంలో తిరిగి ప్రవేశం పొందే అవకాశం కల్పించబడుతుంది. ఇది విద్యార్థులకు కాలానుగుణంగా ఫ్లెక్సిబిలిటీని అందించడమే కాక, వృత్తి అవకాశాలను ముందుగానే వెతుకుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.

Read Also:WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?

విద్యార్థులు తమను ఆసక్తి కలిగించే MOOC (Massive Open Online Courses) కోర్సుల కోసం ఒక సెమిస్టర్ ముందుగానే నమోదు చేసుకోవచ్చు. అయితే వాటి క్రెడిట్లు తదుపరి సెమిస్టర్‌లో లెక్కించబడతాయి. MOOCలో ఫెయిల్ అయితే విద్యార్థులు అదే సబ్జెక్టు రెగ్యులర్ వెర్షన్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులలో సామాజిక, నైతిక అవగాహన పెంచే ఉద్దేశంతో మొత్తం 3 క్రెడిట్లతో నాలుగు తప్పనిసరి కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి. వీటిలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెండర్ సెన్సిటైజేషన్ అండ్ భారత రాజ్యాంగం (Constitution of India) ఉండేలా రూపొందించారు.

Exit mobile version