NTV Telugu Site icon

JIO Mart: క్విక్ కామర్స్‌లోకి జియోమార్ట్.. మొదట ఆ నగరాల్లో మాత్రమే..?!

Jio Mart

Jio Mart

రిలయన్స్ సంస్థల్లో భాగమైన జియో మార్ట్ అతి త్వరలో క్విక్ కామర్స్ సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం ఎనిమిది నగరాలలో ఈ సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఉపయోగించే క్విక్ కామర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన అరగంటలోపే పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉంది.

Exit Polls: నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీకి షాక్ ఇవ్వబోతున్న బీజేపీ..

ఇప్పటికే అన్ని ప్రధాన నగరాలతో కలిపి దేశం మొత్తం రిలయన్స్ సంస్థకు సంబంధించిన రిటైల్ షాపులు దాదాపు 19 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో దేశంలో 1000 నగరాల వరకు జియో క్విక్ కామర్స్ సేవలను అందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే గాని జరిగినట్లయితే దేశంలో అతిపెద్ద క్విక్ కామర్స్ సంస్థల్లో మొదటి స్థానంలో నిలబడుతుంది జియో మార్ట్. ఈ సేవలను మొదలుపెట్టిన తర్వాత అవుట్ లెట్ కేంద్రాల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ఆర్డర్లను తీసుకొని ప్రతి ప్రాంతానికి సేవలు అందించబోతున్నట్లు జియో మార్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక రంగాలలో జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో కూడా జియో మార్ట్ తనదైన మార్కు వేయాలని ప్రస్తుతం ఆలోచనలో ఉంది. చూడాలి మరెంత త్వరగా కస్టమర్లకు సేవ అందించగలదో జియో మార్ట్.