NTV Telugu Site icon

Jio Bharat: జియోభారత్‌ V3, V4 4G ఫీచర్‌ ఫోన్లు రిలీజ్.. ధర ఎంతో తెలుసా..?

జియో భారత్‌ ఈరోజు 4G ఫీచర్‌ ఫోన్‌లను విడుదల చేసింది. జియోభారత్‌ V3, జియోభారత్‌ V4 పేరుతో మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2023 సదస్సులో ఈ ఫీచర్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ల ద్వారా UPI పేమెంట్‌లు చేసుకోవచ్చు. అంతేకాకుండా.. లైవ్‌ టీవీని కూడా వీక్షించవచ్చు. ఈ ఫోన్‌లు 23 భాషలను సపోర్టు చేయనున్నాయి. జియోభారత్‌ V3 ఫోన్‌ను (JioBharat V3 Phone) స్టైల్‌ సెంట్రిక్‌ డివైస్‌గా లాంచ్‌ చేశారు. అదే జియోభారత్‌ V4 (JioBharat V4 Phone) ఫోన్‌ను మెరుగైన అనుభూతి పొందేలా డిజైన్‌ చేశారు. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని పొందవచ్చని జియో చెబుతోంది. జియోభారత్‌ V3, V4 ఫీచర్‌ఫోన్‌లు జియోఛాట్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. దీని ద్వారా అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ మెసెజ్‌, ఫోటో షేరింగ్‌, గ్రూప్‌ మెసేజింగ్‌ ఆప్షన్‌లను పొందవచ్చు.

Air India:న్యూఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు.. కెనడాకు దారి మళ్లింపు..

ఈ రెండు ఫోన్‌లు 1000mAh బ్యాటరీతో పనిచేయనున్నాయి. అంతేకాకుండా.. మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు స్టోరేజీని పొందవచ్చు. ఈ ఫోన్లు జియోటీవీ యాప్‌ను సపోర్టు చేస్తాయి. 455 లైవ్‌ టీవీ ఛానళ్లు వీక్షించేందుకు వీలుంటుందని జియో తెలిపింది. జియోసినిమా లైబ్రరీలో ఉన్న షోలు, సినిమాలను ఈ ఫీచర్ ఫోన్లలో పొందవచ్చు. అలాగే.. ఈ ఫోన్‌లు జియోపే యాప్‌ సపోర్టును కలిగి ఉంటాయి. ఫలితంగా UPI పేమెంట్‌లు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇన్‌బిల్ట్‌ సౌండ్‌బాక్స్‌తో ఈ ఫోన్లు విడుదల అయ్యాయి. ఫలితంగా UPI లావాదేవీల వివరాలు స్పష్టంగా వినిపిస్తాయి.

Realme P1 Speed 5G: రియల్ మీ నుంచి 5G స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ధర ఇవే..!

రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్:
ఈ ఫోన్‌లకు రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చు. జియో భారత్‌ V3, V4 ఫీచర్‌ ఫోన్‌ల ధర రూ.1099 గా ఉంది. ఈ ఫోన్‌లు జియోమార్ట్‌, అమెజాన్‌ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా త్వరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత భారత్‌ మార్కెట్‌లో జియోభారత్‌ V2, జియోభారత్‌ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్బన్‌ భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ 2G నెట్‌వర్క్‌ వినియోగిస్తున్న యూజర్లకు 4G అనుభూతిని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గతంలోనే జియో తెలిపింది.