NTV Telugu Site icon

Jio Air Fiber: బంపర్ ఆఫర్.. త్వరపడండి.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై భారీ తగ్గింపు..

Jio Air Fiber Launching Offer

Jio Air Fiber Launching Offer

Jio Air Fiber Launching Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు తన కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. జియో తన జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై తాజాగా ఓ కొత్త ఫ్రీడమ్ ఆఫర్‌ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జియో సంస్థ ఎయిర్ ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ కనెక్షన్ ఇన్‌స్టాలేషన్‌ పై ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ. 1,000 మినహాయించడం ద్వారా మీరు ఏకంగా 30 శాతం తగ్గింపును పొందవచ్చు.

Donald Trump: మరోసారి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?

ఫ్రీడమ్ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 30 శాతం ఫ్రీడమ్ ఆఫర్‌తో జియో సంబంధించి 3 నెలల జియో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ప్లాన్ ఆగస్టు 15 వరకు రూ. 2,121 మాత్రమే. సాధారణంగా ఈ ప్లాన్ కోసం రూ. 2,121 ఖర్చవుతుంది. అయితే ఇన్‌స్టాలేషన్ కోసం అదనంగా రూ. 1,000 ఉంటుంది. మొత్తం ధర రూ. 3,121 అవుతుంది.

Figs Health Benefits: అంజీర పండ్లను అలసత్వం చేయొద్దు.. ముఖ్యంగా గర్భిణీలు.. ఎందుకంటే.?

ఇక జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌స్ విషయానికి వస్తే.. నెలకు రూ. 599, రూ. 899, రూ. 1,199 ధర గల జియో ఎయిర్ ప్లాన్‌లు 100 Mbps వరకు డౌన్‌ లోడ్, అప్‌ లోడ్ వేగాన్ని అందిస్తాయి. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, బ్రౌజింగ్ కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్లాన్‌ లన్నీ 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 OTT యాప్‌ లకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి. రూ. 1,199 ప్లాన్‌ లో పాటు వినోదం కోసం నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియమ్‌ లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.

Show comments