Site icon NTV Telugu

Jigris Movie: ప్రభాస్‌కు విషెష్ చెబుతూ.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేసిన ‘జిగ్రీస్’ టీమ్!

Jigris Release Date

Jigris Release Date

Jigris Movie Releasing on November 14: రామ్‌ నితిన్‌, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్‌ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్‌’. హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ రిలీజ్ కాగా.. అందరినీ ఆకట్టుకుంది. అలానే యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న జిగ్రీస్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఈరోజు ఫిక్స్ అయింది.

Also Read: Hilesso Update: భారీ ఖర్చుతో తెరకెక్కుతోన్న సుడిగాలి సుధీర్‌ ‘హైలెస్సో’ సినిమా!

ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా జిగ్రీస్‌ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెష్ తెలిపింది. అదే పోస్టర్ ద్వారా జిగ్రీస్ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించింది. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు జిగ్రీస్‌ టీమ్ పేర్కొంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిన్నప్పటి స్నేహితుడే హరీష్‌ రెడ్డి. అందుకే ఈ సినిమాను సందీప్ రెడ్డి దగ్గరుండి మరి ప్రమోషన్ చేస్తున్నారు. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారని, సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని సందీప్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు.

Exit mobile version