Site icon NTV Telugu

Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కి చుక్కెదురు

Rahul

Rahul

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amit Shah) చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీకి (Rahul gandhi) జార్ఖండ్ హైకోర్టులో (jharkhand High Court) చుక్కెదురైంది. పరువు నష్టం కేసును కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాతపూర్వకంగా రాహుల్ అభ్యర్థించినా న్యాయస్థానం మాత్రం నిరాకరించింది.

2018లో అమిత్ షాపై కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలని రాహుల్ గాంధీ పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది.

2018లో అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీన్ ఝా పరువునష్టం దావా వేశారు. తాజాగా హైకోర్టు విచారణ చేపట్టి కాంగ్రెస్ నేత రాహుల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తదుపరి కార్యాచరణపై ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

 

Exit mobile version