Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ ప్రభుత్వం 2014 నుంచి నిర్వహించిన ఏకంగా 44 ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC), టీడీపీఎల్ అనే ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యంగా జేఎస్ఎస్సీ-సీజీఎల్ (JSSC-CGL) పరీక్ష రద్దు నిర్ణయంపై తీవ్ర కలకలం రేగింది. ఈ రద్దు నిర్ణయంతో అప్పటికే ఎంపికై, వివిధ ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు స్వీకరించిన దాదాపు 2,000 మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పారదర్శకంగా ఎంపికైన తమను కూడా అక్రమార్కులతో కలిపి శిక్షించడం సరికాదని, రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాంచీలోని సెక్రటేరియట్ నుంచి బిర్సా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ వివాదం వెనుక సీఐడీ (CID) చేపట్టిన సమగ్ర దర్యాప్తు కీలక పాత్ర పోషించింది. కీలక నిందితుడైన అభయ్ తివారీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు, వివిధ పరీక్షల్లో పాస్ అవ్వడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు రేట్ చార్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు.
Also Read
- 9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమర్థిస్తూ.. నియామక వ్యవస్థపై నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణల కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ ఆధ్వర్యంలో సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. అటు ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మరాండీ మాత్రం సీబీఐ దర్యాప్తు జరపకుండా ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను మోసం చేయడమేనని విమర్శించారు. ఒకవైపు పారదర్శక వ్యవస్థ కోసం పోరాడుతున్న నిరుద్యోగుల డిమాండ్లు, మరోవైపు అప్పటికే ఉద్యోగాలు సాధించి రోడ్డున పడ్డ వేలాది మంది బాధితుల భవిష్యత్తు మధ్య జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది.
- Tags
- Jharkhand
- Job scam
- JPSC Exams
- JSSC
తాజావార్తలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!