NTV Telugu Site icon

Ex CM: మాజీ ముఖ్యమంత్రి ఇలా అయిపోయారేంటి..!?

Jh

Jh

ఆయనో ఓ రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి. ఎంతో దర్పం.. హోదా అనుభవించిన ఆయన.. కొద్ది రోజులు క్రితం అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు, నాలుగు నెలల నుంచి కారాగారంలో ఉంటున్నారు. హఠాత్తుగా సోమవారం జనాల మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడూ సేవింగ్ చేసుకుని నీటుగా కనిపించే రాజకీయ నాయకుడు.. ఒక్కసారిగా గడ్డంతో కనిపించే సరికి పలువురు అయోమయానికి గురయ్యారు. ఇంతకీ ఆయనెవరు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

హేమంత్ సోరెన్.. పరిచయం అక్కర్లేని భారతీయ రాజకీయ నాయకుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు, నాలుగు నెలల నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో.. హైకోర్టులో పిటిషన్ వేసినా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఇటీవల హేమంత్ సోరెన్ మామ రాజారామ్ సోరెన్ చనిపోయారు. సోమవారం ఆయనది కర్మ కార్యక్రమం ఉంది. ఇందుకోసం ఈ వేడుకలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన వారంతా షాక్ అయ్యారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఫుల్ గడ్డం పెంచేశారు. మెరిసి పోయిన గడ్డం ఉండడంతో కొందరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇక ఆయన్ను చేసిన అభిమానులు, కార్యకర్తలు ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. హేమంత్ కూడా ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించారు.

 

భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జనవరిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. బెయిల్‌కు అప్లై చేసినా ఊరట లభించలేదు. తాజాగా మామ కర్మ వేడుకకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న శాసనసభ ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఆమెకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.