Site icon NTV Telugu

Jharkhand: జంషెడ్‌పూర్‌ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Fire

Fire

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బర్మా మైన్స్ ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలోని టైర్ల గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Maldives: గత అధ్యక్షుడు ఓ “విదేశీ రాయబారి” చెప్పినట్లు విన్నాడు: మహ్మద్ ముయిజ్జూ..

టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని అరగంట ముందే సమాచారం అందిందని బర్మామిన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అలోక్ కుమార్ దూబే తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదని.. షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

 

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ తెలుపుతోంది.

 

ఇది కూడా చదవండి: IPL 2024: కోహ్లీ-గంభీర్ గొడవకు ఎండ్ కార్డ్.. వారిద్దరు కలిసిపోయారు

 

Exit mobile version