Site icon NTV Telugu

Viral Incident: గదిలో వేరొకరితో భర్త- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలుసా!

Jharkhand News

Jharkhand News

Viral Incident: ప్రభుత్వ నివాసంలో ఓ భార్య, వేరొకరితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె కోపంతో తన భర్తను ఆ ఇంట్లోనే బంధించింది. ఆ భర్త ఒక CO. ఈ చర్య తర్వాత ఆయన తన భార్యను తలుపు తీయాలని పదేపదే కోరాడు, కానీ ఆమె దానికి నిరాకరించింది. ఆ తర్వాత CO పైకప్పు నుంచి దూకి గొడవ చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, CO ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

READ ALSO: Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్

జార్ఖండ్‌లో వెలుగు చూసిన ఘటన..
జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా మజ్హియావో ప్రాంతానికి చెందిన CO ప్రమోద్ కుమార్ తన స్నేహితురాలితో ఒకే గదిలో నిద్రిస్తున్నాడు. ఆయన భార్య డాక్టర్ శ్యామా రాణి ఈ విషయం తెలుసి ఆమె తెల్లవారుజామున 4 గంటలకు ప్రభుత్వ నివాసానికి చేరుకుంది. ఆ తర్వాత ఆమె గోడ ఎక్కి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె తన భర్త వేరొకరితో నిద్రపోతున్నట్లు కనిపించడంతో వెంటనే బయటి నుంచి తలుపు లాక్ చేసింది. గమనించిన CO తన భార్యను తలుపు తెరవమని అడుగాడు, కానీ దానికి ఆమె నిరాకరించింది. ఘటన ప్రభుత్వ నివాసం వద్ద జరగడంతో సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఎవరూ ఈ సీఓ భార్యను ఆపలేకపోయారు. చివరికి అలసిపోయిన CO పైకప్పు నుంచి కిందకి దూకి గొడవ చేయడం ప్రారంభించాడు.

ఇంతలో మఝియావో పోలీసులు కూడా CO నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు CO స్నేహితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా CO భార్య మీడియాతో మాట్లాడుతూ.. “నాకు చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. కానీ ఈరోజు అవి నిజం అయ్యాయి. ఇప్పుడు మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని చెప్పింది. ఈ CO భార్య బీహార్ మాజీ MP శ్రీరామ్ మాంఝీ కుమార్తె అని సమాచారం.

READ ALSO: Shah Rukh Khan: బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్ ఖాన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా!

Exit mobile version