NTV Telugu Site icon

MLC Jeevan Reddy : ఇథనాల్ వద్దు.. చక్కెర ముద్దు అంటూ ప్రచారం చేస్తాం

Jeevan Reddy

Jeevan Reddy

మరోసారి రాష్టప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ గా మారిందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకన్న ఆంధ్ర ప్రజలకే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు కూడా లేవు.ఇందుకేనా తెలంగాణ…తెచ్చుకుంది..ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కెసిఆర్ ఎక్కడికి పోయిన గ్రామ పంచాయతీలకు 10 లక్షలు నిధులు మంజూరు చేస్తారని ఆయన మండిపడ్డారు. జగిత్యాల లో మాత్రం ఎమ్మెల్యేల కు రు.10 కోట్ల నిధులు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం

జగిత్యాల పై సీఎం కెసిఆర్ కు ఎందుకో మరి కోపమని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల పట్టణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్ని నిధులు సమకూర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకీ ఆర్భాటాలు.. విమర్శలు చేయడమని, నిత్యం గత పాలకులు ఏం చేశారంటూ విమర్శించడం కాదు..వాస్తవాలను గ్రహించాలిని హితవు పలికారు జీవన్‌ రెడ్డి. గత పాలకులతో నే జగిత్యాల కు గుర్తింపు వచ్చిందని, ధాన్యం సేకరణ చేపట్టింది కాంగ్రెస్ఉచిత విద్యుత్ ప్రారంభించిందని జీవన్‌ రెడ్డి అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ 9 గంటలు ఇచ్చామని, ఇప్పుడు 12 గంటలు ఇస్తున్నారని, ధర్మపురికి తాగు నీరు అందించింది కాంగ్రెస్ అని మంత్రి ఈశ్వర్ తెలుసుకోవాలని జీవన్‌ రెడ్డి హితవు పలికారు.

Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామంలో మేం ఓట్లు అడుగ అని, ధర్మ కాంట తూకం వేసిన తర్వాత ట్రక్ షీట్ పేరిట దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్ల కొమ్ము కాయడం లేదా మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలన్నారు. ఇథనాల్ కాలుష్యం వస్తె ముక్కు భూమికి రాస్తానంటు కొప్పుల ఈశ్వర్ సవాలు పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికే ఈశ్వర్ కు ముక్కు భూమికి రాసినంత పని అయిందని, రాబోయే ఎన్నికల్లో ఈశ్వర్ ను ఎట్లా అయిన ఓటర్లు ముక్కు భూమికి రాపిస్తరన్నారు. ఇథనాల్ వద్దు .చక్కెర ముద్దు..కాంగ్రెస్ ప్రచారం చేస్తామని, చక్కెర ఫ్యాక్టరీ వద్దు..ఇథనాల్ ముద్దు అని మంత్రి ఈశ్వర్ ప్రచారం చేసుకోవాలని సవాలు విసిరారు.