NTV Telugu Site icon

Jeevan Reddy : సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులకు మీ పార్టీ బాధ్యత లేదా

Jeevan Reddy

Jeevan Reddy

మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడు బుద్ది వచ్చిందని, సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులకు మీ పార్టీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు చేసి పెద్దోడు ఐపోతా అనుకుంటే ఎలా.. ఆరోపణలు చేయడానికి కొంత ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరు ఒక్కటై..ఆరోపణలు చేయడంలో కూడా ఒక్కటయ్యారని, ఆలోచించి మాట్లాడాలన్నారు. పేపర్లో పేరు వస్తుంది అని..మాట్లాడితే ఎట్లా.. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంస్థలు కేంద్రం పరిధిలోనివే కదా అని ఆయన అన్నారు. విచారణ చేయించు… ఆరోపణలు చేస్తే పెద్ద లీడర్ కావు.. వాస్తవాలు మాట్లాడితే పెద్ద లీడర్ ఐతవు.. కేటీఆర్..నువ్వు రుణమాఫీ చేయడనికి ఐదేండ్లు పట్టిందన్నారు. మేము ఐదు నెలల్లో మాఫీ చేస్తాం అంటే ఓర్వలేకపోతున్నావని ఆయన మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని, ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాపాడుతామన్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.