జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో మొత్తం 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్‌కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు.
ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 12,58,136మంది రాశారు. ఇదిలా ఉండగా.. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారికి మరో అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు.
READ MORE: Beauty Tips: ముఖంపై మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి
ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి?
ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in కి వెళ్లండి. తరువాత సెషన్ 1 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ ఫలితాన్ని చూసి డౌన్‌లోడ్ చేసుకోండి.