NTV Telugu Site icon

JEE Mains: జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు!

Jee Main 2024

Jee Main 2024

JEE Main 2024 Registration Last Date: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌ తొలి విడత దరఖాస్తు గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పొడిగించింది. తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4 (రాత్రి 9 గంటల) వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం (నవంబర్ 30) రాత్రితో ముగియగా.. దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు ఎన్‌టీఏ పొడిగించింది. ఇక సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పిదాలు ఉంటే.. వెబ్‌సైట్‌లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.

జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ న‌వంబ‌ర్ 1వ తేదీన మొదలైంది. ఇక జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరుగుతుంది. రెండో విడత ఏప్రిల్‌లో (6-12) జరుగుతుంది. BE/ BTech జేఈఈ మెయిన్ పేపర్ 1లో ఉంటాయి.

Show comments