NTV Telugu Site icon

Formula E Racing: ముగిసిన ఫార్ములా ఈ రేసింగ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ విజేత జీన్‌ ఎరిక్‌

Formula E Racing

Formula E Racing

Formula E Racing: హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేసింగ్ ఇవాళ సాయంత్రం ముగిసింది. నెక్లెస్‌ రోడ్‌ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్‌ షిప్‌లో జీన్‌ ఎరిక్‌ విజేతగా నిలిచాడు. భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరిగిన రేసింగ్‌ ప్రపంచస్థాయి రేసర్లు తమ సత్తాను చాటుకున్నారు. మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. జీన్‌ ఎరిక్‌ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్‌ ఎరిక్‌ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా- ఈ ఛాంపియన్‌ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. భారత్‌ నుంచి టీసీఎస్‌ జాగ్వార్‌, మహీంద్ర రేసింగ్ పోటీలో నిలిచారు.

bachelors padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు

ఈ- రేస్ కోసం తొలిసారి అత్యాధునిక జెన్3 కార్లని వినియోగించారు. ఆ కార్లతో సర్క్యూట్‌పై రేసర్లు చెలరేగిపోయారు. మొత్తం 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. 2013లో తొలిసారి భారత్ ఫార్ములా -1కి ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత భారత్‌లో జరిగిన ఫార్ములా రేసు ఇదేకాగా.. దానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ- రేసు కోసం మొత్తం 2.8కిమీ సర్క్యూట్‌ని అధికారులు రెడీచేయగా.. ఇందులో 18 మలుపుల్ని ఉంచారు.ఫార్ములా- ఈ రేసుని తిలకించేందుకు టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, దుల్కర్ సల్మాన్, శృతి హాసన్ తదితరులు హాజరయ్యారు. అలానే భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్ తదితరులు హాజరయ్యారు. అలానే ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా వచ్చాడు. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా- ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్‌ చోటు దక్కించుకోవడం గమనార్హం.

Show comments