Site icon NTV Telugu

HD Revanna: కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు ఊరట.. బెయిల్ మంజూర్

Hd

Hd

హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారం మంజూరు చేశారు. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించారు.

ఇది కూడా చదవండి: luxury home sales: భారత్ లో ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగిన విలాసవంతమైన గృహాల అమ్మకాలు..

కిడ్నాపింగ్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో మే 4న ఆయన పోలీసులు అరెస్టు చేశారు. మే 8 వరకూ పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మే 14 వరకూ ఆయనకు జ్యూడిషయల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల బాధితురాలిని హెచ్‌డీ రేవణ్ణ ఆదేశాలతోనే ఆయన అనుచరుడు ఏప్రిల్ 29న ఇంటి నుంచి అపహరించుకు వెళ్లినట్టు కోర్టుకు సిట్ తన వాదన వినిపించింది. మే 5న హెచ్‌డీ రేవణ్ణ సన్నిహితునికి చెందిన ఒక పొలంలో బాధిత మహిళను కనుగొన్నట్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తూ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: Mumbai: తుఫాన్ బీభత్సం.. హోర్డింగ్ కూలి 8 మంది మృతి, 59 మందికి గాయాలు

ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల పెన్‌డ్రైవ్ బయటపడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడు. ఆయనకు దర్యాప్తు సంస్థ లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఏ క్షణంలోనైనా ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసేందుకు సిట్ సిద్ధంగా ఉంది.

ఇది కూడా చదవండి: MS Dhoni: రాబోయే సంవత్సరాల్లో చెన్నైలో ‘ధోని’ దేవాలయాలు కడతారు..

Exit mobile version