Site icon NTV Telugu

JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్‌గా మారిన పోస్ట్!

Jdvance

Jdvance

JD Vance divorce: సంచలనాలకు కేంద్ర బిందువు అయిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను దాటి, ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవల తన భార్య మతం గురించి వ్యాఖ్యానించడం, దాని తర్వాత, ఎరికా కిర్క్‌తో ఆయన ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఉపాధ్యక్ష దంపతులు తర్వలోనే విడాకులు తీసుకుంటారనే పుకార్లు చెలరేగుతున్నాయి. తన హిందూ భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతంలోకి మారుతుందని జెడి వాన్స్ ఇటీవల తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకటన తర్వాత వచ్చిన విమర్శలు, ఇటీవల ఎరికా కిర్క్‌తో ఆయన ఉన్న ఫోటో వార్తల్లో నిలిచేలా చేశాయి.

READ ALSO: BSNL: బీఎస్ఎన్ఎల్ 50 రోజుల ప్లాన్.. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్‌

విడాకుల వార్తలు ఎప్పుడు మొదలయ్యాయి..
J.D. వాన్స్ ప్రకటన, తర్వాత ఎరికా కిర్క్‌తో ఆయన ఉన్న ఫోటో చుట్టూ వివాదం అక్టోబర్ 29న మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన టర్నింగ్ పాయింట్ USA కార్యక్రమంలో ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో J.D. వాన్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతను దివంగత చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్నట్లు కనిపించారు. వాళ్లిద్దరూ కౌగిలించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎరికా మాట్లాడుతూ.. “నా భర్త స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, కానీ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్‌లో నాకు చార్లీ కిర్క్ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి ఆయనను పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని వేదికపై నుంచి చెప్పింది. అనంతరం వాన్స్ వేదికపైకి రాగానే, ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. వారి ఆలింగనం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది జెడి వాన్స్ తన భార్య ఉష నుంచి విడాకులు తీసుకోనున్నారనే పుకార్లకు దారితీసింది.

JD వాన్స్ గతంలో తన భార్య హిందూ మతం గురించి కూడా ఒక ప్రకటన చేశారు. దీంతో వాళ్లిద్దరి విడాకుల ప్రకటనలకు ఈ చర్యలు మరింత ఆజ్యం పోశాయి. తన భార్య ఉష ఏదో ఒక రోజు కాథలిక్ చర్చిచే ప్రభావితమై క్రైస్తవ మతంలోకి మారుతుందని JD వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలో న్యూయార్క్ టైమ్స్ రచయిత్రి షానన్ వాట్స్.. వాన్స్ గురించి సంచలనాత్మక పోస్ట్ చేశారు. వాన్స్ తన విడాకులను ప్రకటించి, వచ్చే ఏడాది చివరి నాటికి చార్లీ కిర్క్ భార్య ఎరికాను వివాహం చేసుకుంటాడని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. వాన్స్ – ఎరికా ఆలింగనం చేసుకుంటున్నట్లు చూపిస్తున్న వైరల్ ఫోటోలకు ప్రతిస్పందనగా ఆమె ఈ వ్యాఖ్య జత చేశారు. షానన్ వాట్స్ పోస్ట్‌కి 8.8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అయితే, జె.డి. వాన్స్ లేదా ఎరికా కిర్క్ ఈ ఊహాగానాలకు అధికారికంగా స్పందించలేదు.

వివరణ ఇచ్చిన వాన్స్..
తన భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతంలోకి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన తర్వాత జెడి వాన్స్ విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన తన ప్రకటనకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వాన్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో “మతమార్పు ఉద్దేశ్యం లేదు” అని స్పష్టం చేశారు. ఉష – జెడిల మధ్య మతపరమైన విభేదాల కారణంగా విడాకుల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తన భార్యకు మతం మారే ఉద్దేశ్యం లేదని, ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందని వాన్స్ స్వయంగా స్పష్టం చేశారు. అయినా కూడా ఈ ప్రచారానికి ముగింపు రాలేదు. ఈ ప్రచారాలపై జెడి వాన్స్ లేదా ఉష లేదా ఎరికా కిర్క్ ఈ ముగ్గురిలో ఎవరైనా ఒకరు స్పందించే వరకు ఇవి ఆగవని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Iran Nuclear Program: ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’

Exit mobile version