AP Special Status: 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదన్నారు.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి, సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగానే మారిపోయింది. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదన్నారు.. పోలవరం నీటినిల్వ 41.15 కి కేంద్రం కుదించాలని చూస్తోందన్న ఆయన.. అలా కాకుండా 45.72 కొనసాగిస్తే, 900 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీ నీరు కృష్ణ నదికి విడుదల చేసి.. 23.44 టీఎంసీలు విశాఖకు కేటాయించవచ్చు అన్నారు.. ఆ దిశగా కేంద్రంపై ఏపీకి చెందిన ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు..
Read Also: Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!
ఇక, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రం నయవంచనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రపంచంలోనే డెడ్ స్టోరేజ్ వాటర్ ప్రాజెక్టుగా పోలవరం కాబోతోందన్న ఆయన.. అలా అయితే ఏపీ ఎంపీలు చరిత్ర హీనులు అవుతారని మండిపడ్డారు.. బడ్జెట్‌లో గుజరాత్ కి 8 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు.. ఏపీకి మాత్రం 278 కోట్లు ఇస్తే సంబరాలు జరుపుకున్నారని దుయ్యబట్టారు.. ఎవ్వరినీ విమర్శించడం లేదన్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నాం.. కేంద్రం.. ఏపీకి అప్పు తీసిచ్చి, సాయం అంటున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు 49 వేల కోట్లు రావాలి.. నమ్మక ద్రోహం, వంచన జరిగింది.. ఎంపీలు అందరూ స్పందించాలని డిమాండ్ చేశారు.
Read Also: Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!
చంద్రబాబు, లోకేష్… దావోస్ కి వెళ్లి మోడీ భజన చేయాల్సిన అవసరం ఏంటి..? అని మండిపడ్డారు చలసాని శ్రీనివాస్.. ఆయనకు భజన చేశారు కాబట్టే, పెట్టుబడులు అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయి… విభజన చట్టం ముగిసిన చాప్టార్ అన్న వాళ్ళు ద్రోహులు అని మండిపడ్డారు.. యువత మేలుకో… విభజన బిల్లు అమలు కోసం పోరాటం చేయకుంటే, ఇంకో తరం నాశనం అవుతుందని పిలుపునిచ్చారు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీని రాష్ట్రంగా కాకుండా జిల్లాగా ప్రస్తావించారని ఆవేదన వ్యక్తం చేశారు.. దీనిపై ముఖ్యమంత్రి గానీ, ఉపముఖ్యమంత్రి గానీ, ఎంపీలు గానీ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్..