JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జె.డి. చక్రవర్తి ఏదైనా మాట్లాడారంటే అందులో ఒక వెరైటీ ఉంటుంది. తాజాగా ‘గాయపడ్డ సింహం’ (GPS) ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తావన తీసుకువచ్చారు. “కమల్ హాసన్ గారు ఒక అద్భుతం. నటనలో ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. కానీ, ఒకటి మాత్రం నిజం.. ఆయన అంతటి మహానటుడికి కూడా ఇప్పటివరకు ఇలాంటి ఒక విభిన్నమైన పాత్ర దొరకలేదు” అంటూ జె.డి. షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మాటలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే నెటిజన్లు ట్రోల్ చేస్తారని ముందే ఊహించిన ఆయన, కమల్ హాసన్ పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూనే తన క్యారెక్టర్ లోని డెప్త్ గురించి వివరించారు.
Also Read :Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
తరుణ్ భాస్కర్ హీరోగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇందులో జె.డి. చక్రవర్తి ఒక పవర్‌ఫుల్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కమల్ హాసన్ అనేక ప్రయోగాత్మక పాత్రలు చేసినప్పటికీ, ‘గాయపడ్డ సింహం’లో తాను చేస్తున్న పాత్ర చాలా యూనిక్ గా ఉంటుందని జె.డి. ధీమా వ్యక్తం చేశారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తుండగా, పవన్ సాదినేని సమర్పణలో నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జె.డి. చేసిన ఈ కామెంట్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!