NTV Telugu Site icon

Jc Prabhakar Reddy Protest: తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో మూడోరోజు జేసీ దీక్ష

Jc1

Jc1

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎప్పుడూ వార్తల్లో వుంటుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో సోమవారం నుంచి నిరసనకు దిగారు మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన చేపట్టిన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్స్ తో దీక్ష చేస్తున్నారు జేసీ. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరును, కమిషనర్‌ అక్రమాలను నిరసిస్తూ ప్రభాకర్‌ రెడ్డి మునిసిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపైనే దీక్షకు దిగారు. రోడ్డుపైనే స్నానం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగించారు.

Read Also:Muslim reservation: ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై కర్ణాటక సీఎం కీలక ప్రకటన

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున చేరుకున్నారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలోనే ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆయన నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా నిర్లక్ష్య ధోరణి వ్యతిరేకంగా సోమవారం టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని నిద్రిస్తున్నారు. ఒక మునిసిపల్ చైర్మన్ ఇలా దీక్షకు దిగడం విశేషంగా చెబుతున్నారు.

Read Also: Singapore: సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరి

Show comments