NTV Telugu Site icon

Jaya Prakash Narayana: మధ్యయుగ పైశాచికాన్ని ఇవాళ రాజకీయాలలో చొప్పించారు..

Jaya Prakash

Jaya Prakash

విజయవాడలో మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు పాల్గొన్నారు. రాజకీయ రంగాన భిన్న దృశ్యాలు అంశంతో దేవులపల్లి అమర్ పుస్తకం రచించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ.. యుక్తా యుక్త విచక్షణ లేకుండా సమాజం ఉంది.. మధ్యయుగ పైశాచికాన్ని ఇవాళ రాజకీయాలలో చొప్పించారు అని ఆయన కామెంట్స్ చేశారు. నేను పత్రికలు చదవను, టివి చూడను.. నిజమైన రాజకీయం పవిత్రమైన వ్యాసాంగం.. రాజకీయాన్ని వ్యతిరేకించే తీరు ప్రమాదకరం అని జయప్రకాశ్ నారాయణ అన్నారు.

Read Also: SpiceJet : తగ్గనున్న స్పైస్‌జెట్ సమస్యలు.. రూ.744కోట్లు సేకరించిన సంస్థ

రాజకీయ పార్టీల మధ్య ద్వేషం.. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదా అని లోక్ సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ సమాజమైనా పార్టీల మధ్య ద్వేషం సిగ్గుచేటు అన్నారు. సిద్ధాంత విబేధాల కారణంగా మనుషులను బూతులు తిట్టడం కుసంస్కారం అని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని, అభివృద్ధిని కొంత వరకూ సమన్వయం చేశారు.. రాబోయే రోజుల్లో ముఠాలుగా చీలిపోయిన పెద్ద వారికి బుద్ధి చెపుతారని ఆశిస్తున్నాను అని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు.