Site icon NTV Telugu

Jaya Bachchan : ఆ విషయంలో.. ఈ తరం పిల్లలకు సలహాలు ఇవ్వలేం

Jaya Bachan

Jaya Bachan

జయా బచ్చన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినీ రంగం నుంచి రాజకీయాల దాకా తనదైన ముద్ర వేసుకున్న ఆమె ‘వి ది విమెన్’ కార్యక్రమంలో పాల్గొని ఈతరం పిల్లల ఆలోచనల విధానం, వారి నిర్ణయాలు గురించి మాట్లాడారు. ప్రస్తుత జనరేషన్‌ పిల్లలకు తాను వివాహంపై సలహాలు ఇవ్వబోనని జయా బచ్చన్ స్పష్టం చేశారు. జీవితాన్ని వారు తమదైన విధంగా ఆస్వాదించగలిగే స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు తన మనవరాలు నవ్య నవేలి నందా భవిష్యత్తు, వివాహంపై మాట్లాడుతూ జయా, “నవ్య ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ముందుగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. కొద్ది రోజుల్లో ఆమెకు 28 సంవత్సరాలు నిండేస్తాయి. నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారిపోయాయి. పిల్లలు ఇప్పుడు తెలివితేటల్లో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో మనల్ని మించిపోయారు” అని అన్నారు.

Also Read : kamal-vijay : ఆ ఒక్క విషయంలో విజయ్‌‌కి నేను సలహా ఇవ్వలేను – కమల్ హాసన్ షాకింగ్ కామెంట్

అంతేకాదు, వివాహం అంటే ఒకే విధమైన నిర్వచనం ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. “వివాహం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చట్టబద్ధ నిర్వచనాలు లేవు. నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు మనుషులు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలన్నదే ముఖ్యమైన విషయం” అని జయా బచ్చన్ తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక అమితాబ్–జయా బచ్చన్ మనవరాలు నవ్య, సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె సినిమాల్లోకి వస్తుందనే వార్తలు పలుమార్లు వచ్చినా, నవ్య స్వయంగా “నాకు యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు” అని స్పష్టం చేసింది. స్నేహితులతో కలిసి మహిళల కోసం ‘ఆరా హెల్త్’ పేరుతో ఒక ఆన్‌లైన్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించి, శారీరక–మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కా రాసివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version