NTV Telugu Site icon

Jawa 42 FJ 350 Launched: భారత మార్కెట్ లోకి వచ్చేసిన జావా 42 FJ 350..

Jawa 42fj 350

Jawa 42fj 350

Jawa 42 FJ 350 Launched in India: ఈ రోజు (సెప్టెంబర్ 3) జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ జావా 42 ఆధారంగా కొత్త జావా 42 ఎఫ్‌జె మోడల్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కొత్త స్టైలింగ్, కాస్త పెద్ద ఇంజన్‌ లుక్ తో విడుదల చేయబడింది. ఈ సరికొత్త బైక్‌లో LED హెడ్‌ల్యాంప్‌ లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌ గా అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, TVS రోనిన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లకు పోటీగా రానుంది. జావా 42 FJ స్టాండర్డ్ మోడల్ కంటే మరింత స్టైలింగ్‌ లుక్ ను కలిగి ఉంది. టియర్ డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్‌ పై సిల్వర్ కలర్ లో మరింత మెరుగ్గా ‘జావా’ లోగో కనపడుతోంది.

PAK vs BAN: మరోసారి పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లా..

అలాగే సైడ్ ప్యానెల్‌లు, ఫెండర్‌లు స్టాండర్డ్ బైక్ నుండి తీసుకోబడ్డాయి. అయితే సీటు డిజైన్ కొత్తది. ఇక సౌకర్యవంతమైన రైడింగ్ కోసం హ్యాండిల్‌ బార్ లో మార్పులు చేసారు. ద్విచక్ర వాహనంలో మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, అప్‌ స్వెప్ట్ ఎగ్జాస్ట్, ఆఫ్ సెట్ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ కూడా ఉన్నాయి. 42 FJ జావా 350 నుండి అప్గ్రేడ్ చేయబడిన 334cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 29.1hp శక్తిని, 29.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇది 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌తో వస్తుంది. కొత్త జావా బైక్ సీట్ ఎత్తు 790mm, గ్రౌండ్ క్లియరెన్స్ 178mm. ఇక జావా 42 కంటే ఈ బైక్ 2 కిలోలు ఎక్కువగా ఉంటూ 184 కిలోలుగా ఉంది. దీని ధర రూ. 1.99 లక్షల నుండి రూ. 2.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీని ప్రారంభ ధర జావా 42 కంటే రూ. 26,000 ఎక్కువ.

Show comments