NTV Telugu Site icon

Jasprit Bumrah: స్పిన్నర్‌గా మారిన జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్! అన్ని రూమర్లకు చెక్

Jasprit Bumrah

Jasprit Bumrah

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం.. శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. పెర్త్ టెస్టులో భారత్‌ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌ కోసం బుధవారం బ్రిస్బేన్‌ చేరుకున్న రోహిత్ సేన.. ప్రాక్టీస్ మొదలెట్టింది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబందించిన ఓ వీడియో వైరల్ అయింది.

మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా స్పిన్నర్‌గా మారాడు. టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా బుమ్రా స్పిన్ బౌలింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ వేసేముందు రెండు లెగ్ స్పిన్ డెలివరీలను సంధించాడు. ఆ బంతులను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్ దగ్గరుండి మరీ పరీక్షించాడు. రెండు స్పిన్ డెలివరీల అనంతరం ఫాస్ట్ బౌలింగ్ చేశాడు. బుమ్రా బంతులను టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. భారత జట్టుకు మరో స్పిన్నర్‌ దొరికేశాడోచ్ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

ప్రాక్టీస్‌లో జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌గా కనిపించాడు. దాంతో సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు చెక్ పడింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ అనంతరం బుమ్రా మైదానంలో ఇబ్బంది కాస్త పడుతూ కనిపించాడు. టీమిండియా ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. అయితే అది తిమ్మిరి మాత్రమే అని, ఏ సమస్య లేదని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ చెప్పాడు. ఆసీస్ 19 పరుగుల ఛేదనలో బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో అతడు పాల్గొనలేదు. దాంతో మూడో టెస్టుకు బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని నెట్టింట్లో న్యూస్ వచ్చాయి. తాజాగా ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయడంతో అన్ని రూమర్లకు చెక్ పడింది.

Show comments