NTV Telugu Site icon

Jasprit Bumrah: నెట్స్‌లో బుమ్రా బౌలింగ్.. ఆసీస్‌తో టెస్టులకు సిద్ధమైనట్లేనా!

Bu'1

Bu'1

వెన్నునొప్పికి చికిత్స తీసుకున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం అతడు కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. తాజాగా అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బుమ్రా బౌలింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉంది. లేదంటే బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం అతన్ని కూడా దేశవాళీల్లో ఆడించిన తర్వాతనే జట్టుకు తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బుమ్రా మళ్లీ బౌలింగ్ చేయడం భారత క్రికెట్‌కు శుభవార్తే అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ కనుక భారత్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే బుమ్రా జట్టుకు చాలా కీలకం కానున్నాడని అంటున్నారు.

Also Read: Project K: ఓరి బాబో ఆపండ్రా .. ఇక్కడ ఒక్కటే అవ్వలేదు అప్పుడే రెండోదా..?

ఆసియా కప్ ప్రారంభానికి ముందే అతనికి వెన్నునొప్పి తీవ్రమైంది. దీంతో అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ టోర్నీలో కూడా ఆడలేదు. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని అతన్ని త్వరపెట్టిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచులకు అతన్ని తీసుకున్నారు. ఈ వ్యూహం బెడిసికొట్టింది. బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో అతను టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టులకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఫిట్‌నెస్ టెస్టును అతను క్లియర్ చేయలేకపోయాడు. వెన్నులో ఇబ్బందిగా ఉండటంతో అతను మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతన్ని తొందర పెట్టడం అనవసరం అనుకున్న బీసీసీఐ.. అతను కోలుకోవడానికి ఎంత టైం పడితే అంత ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే అతన్ని ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ఎంపిక చేయలేదు.

Also Read: Hanuma Vihari: అందుకే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశా: హనుమ విహారి