Site icon NTV Telugu

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు విడుదల.. మళ్లీ ఆడేది ఎప్పుడో!

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah Will Play Asia Cup 2025: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. పని భార నిర్వహణలో భాగంగా చివరి టెస్ట్ ఆడడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందే మూడు టెస్టులు మాత్రమే ఆడుతానని బీసీసీఐకి బుమ్రా తెలిపిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్ట్ ఆడని బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. బుమ్రా స్వదేశానికి వచ్చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా కొన్నేళ్లుగా గాయాలతో పోరాడుతున్నాడు. ముఖ్యంగా వెన్ను గాయం అతడిని ఇబ్బందిపెడుతోంది. వెన్ను గాయానికి శస్త్రచికిత్స తీసుకున్నా.. మరలా తిరగబెడుతోంది. 2014 చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో రాణించినా.. సిరీస్‌ చివర్లో గాయం తిరగబెట్టింది. దాంతో అతడు నాలుగైదు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ ముందే నిర్ణయించింది. మొదటి, మూడు, నాలుగు టెస్టుల్లో బుమ్రా ఆడాడు. సిరీస్‌లో భారత్ వెనకబడిన నేపథ్యంలో చివరి టెస్టులో బుమ్రా ఆడతాడని అందరూ అనుకున్నా.. అది జరగలేదు.

Also Read: CM Chandrababu: ఇక్కడ ఉంది సీబీఎన్.. వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం!

ఇక సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్‌ 2025 ఆరంభం కానుంది. ఈ లోగా జస్ప్రీత్ బుమ్రాకు నెలన్నర విశ్రాంతి దక్కనుంది. బుమ్రా ఆసియా కప్‌ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీ20 టోర్నీ కాబట్టి ఓ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలర్ వేస్తాడు. బుమ్రా ఆడే అవకాశాలే ఎక్కువ. అక్టోబరులో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ ట్రస్టులలో బుమ్రా ఎన్ని మ్యాచ్‌లు ఆడుతాడో చూడాలి. మరోవైపు అన్ని మ్యాచ్‌లు ఆడితేనే జట్టులోకి ఎంపిక చేయాలని మాజీలు అంటున్నారు. మరి బుమ్రా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version