Site icon NTV Telugu

Jasprit Bumrah: ముంబై పేస్ సెన్సేషన్ వచ్చేశాడు.. కుమారుడికి జంగిల్ కథ చెప్పిన సంజనా గణేశన్!

Jasprit Bumrah Sanjana

Jasprit Bumrah Sanjana

ఐపీఎల్ 2025లో విజయాలు లేక సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ప్రాంచైజీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ‘రెడీ టు రోర్’ అని క్యాప్షన్ ఇచ్చి.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో బుమ్రా సతీమణి సంజనా గణేశన్, కుమారుడు అంగద్‌ను చూపించారు. అంగద్‌కు తండ్రి బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి సంజనా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జస్ప్రీత్ బుమ్రా గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో అతడు గాయానికి చికిత్స తీసుకున్నాడు. ఆ మధ్య బౌలింగ్ మొదలెట్టిన బుమ్రా.. వేగంగా కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో పాసై.. ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరాడు. బుమ్రా జట్టులో చేరినప్పటికీ.. ఏప్రిల్ 7 (సోమవారం)న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఆడడం అనుమానమే అని తెలుస్తోంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని తెలుస్తోంది.

Also Read: Sanju Samson: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌.. సంజూ శాంసన్ చరిత్ర!

జస్ప్రీత్ బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్‌ శిబిరంతో సహా అభిమానుల్లో ఆనందం విరాజిల్లుతోంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక విజయం మాత్రమే సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బుమ్రా తిరిగి రావడంతో ముంబై తిరిగి పుంజుకుంటుందని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ జట్టులో ఉన్నప్పటికీ.. వారు ఆశించిన మేర రాణించడం లేదు. బుమ్రా అండతో వారిద్దరూ చెలరేగే అవకాశం ఉంది. బుమ్రా రాక ముంబైని విజయాల బాట పట్టిస్తుందో చూడాలి.

 

Exit mobile version