Site icon NTV Telugu

Jasprit Bumrah: కంటెంట్‌ క్రియేటర్‌ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్..

Jasprit Bumrah

Jasprit Bumrah

ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దాంట్లో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులు కూడా భారీగా పెరుగుతున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి అనేక ప్లాట్ఫామ్లను తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వీటిని ఉపయోగించుకొని కొందరు సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది సినిమా స్టార్లు సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వారి అభిమానులను పలకరిస్తూ ఉంటారు. వీరితోపాటు కొందరు క్రికెటర్స్ కూడా కంటెంట్ క్రియేటర్స్ గా మారిపోతున్నారు.

Also Read: World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..

టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, చాహల్ లాంటి మరో కొంతమంది ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా కంటెట్ క్రియేట్ చేస్తూ వారి అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా దిగ్గజ బౌలర్ జస్ట్ ప్రీత్ బూమ్రా కూడా చేరిపోయాడు. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

Also Read: Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..

ఈ పోస్టులో.. ‘అందరికీ హలో నేను నా సొంత యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టానని చెప్పడానికి వచ్చినట్లు తెలిపాడు. మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని కంటెంట్ ను తాను అందించబోతున్నట్లు., అలాగే నా జీవితంలో ఆసక్తికర అంశాలను కూడా మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నాడు. కాబట్టి కింది లింకును క్లిక్ చేసి తన జర్నీలో మీరు చేరండి ., మిమ్మల్ని అక్కడ కలుస్తా’ అంటూ పోస్టులో పేర్కొన్నాడు.

యూట్యూబ్‌ ఛానెల్‌ లింక్‌: https://www.youtube.com/@JaspritBumrah1993

Exit mobile version