NTV Telugu Site icon

Shree TMT Steel: శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జస్ప్రీత్ బుమ్రా’..

Shree Tmt

Shree Tmt

శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. శ్రేష్ఠమైన ఉత్పత్తులను అందించడంలో వారికున్న తపనను వివరిస్తూ.. దీని కోసం జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొంది. నేడు నిర్మాణ ప్రపంచంలో శ్రీ TMT స్టీల్ అగ్రగామిగా ఉంది.. ఇది దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉత్పత్తి చేయబడింది. బలమైన, దీర్ఘకాలం మన్నికైన, ఫ్లెక్సిబిలిటీకి పేరుగాంచిన శ్రీ TMT బార్‌లు తెలివైన ప్రతి బిల్డర్‌ల యొక్క ప్రసిద్ధ ఎంపికగా చాలా కాలంగా తమ స్థానాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపధ్యంలో నేడు తమ బ్రాండ్ అంబాసిడర్‌ని ప్రకటిస్తూ.. దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ ఉత్పాదన యొక్క శ్రేష్ఠత కోసం వారి తపనను వ్యక్త పరిచింది. దీనికి ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపింది.

బుమ్రా తన అద్భుతమైన ఆట ప్రదర్శన ద్వారా అందరికి సుపరిచితమైన వ్యక్తి. మన భారతదేశంలో ఎంతో మంది యువ ఆటగాళ్లకి ఆదర్శం. అలాగే మన భారత దేశంలో ఇప్పటి వరకు ఆడిన గొప్పవారిలో గొప్ప ఫాస్ట్ బౌలర్గా పేరు సంపాదించాడు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. శ్రీ TMTతో వారి బ్రాండ్ అంబాసిడర్‌గా తన భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. అన్నింటికంటే నాణ్యత మరియు విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్‌తో అనుబంధం అనేది ఒక గౌరవం.. మున్ముందు పటిష్టమైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను! ” అని చెప్పారు.

Flights Cancelled: రెమల్ తుఫాను ఎఫెక్ట్.. 14 విమానాలు రద్దు

“మా ఉత్పాదన రంగంలో నిరంతరం రాణించడానికి.. ప్రతిసారీ ఉత్తమమైన ఫలితాలని అందించడానికి బుమ్రా మా కార్పొరేట్ దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని” దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఎం.డీ. శ్రీ TMT స్టీల్ రాడ్ల తయారీదారులు శ్రీ ప్రకాష్ గోయెంకా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట సింగిల్ రిబ్బెడ్ బార్‌లతో తాము ప్రారంభించామని.. తరువాత 2X మరియు 3X బార్‌లను తయారు అందించామన్నారు. ప్రతిసారీ తాము తమ ఉత్పత్తిలో అధిక బలమైన, దీర్ఘకాలం మన్నికైన స్థితిస్థాపకత ఉండే విధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. శ్రీ TMT పోటీతత్వ ధరలకు అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తులను అందించడానికి అంకితం చేయబడింది. ఇది TMT బార్‌లు, స్టీల్ ఉత్పత్తుల తయారీలో భారతదేశపు ప్రముఖ తయారీ దారులలో ఒకటిగా నిలిచింది.

డైరెక్టర్ శ్రీ నీరజ్ గోయెంకా మాట్లాడుతూ, “మా కస్టమర్‌లకు ప్రీమియం ఉత్పత్తిని అందించడానికి మరియు డీలర్‌లు, బిల్డర్‌లకు అత్యుత్తమ విలువను అందించడానికి మేము అంకితభావంతో పనిచేస్తున్నాము. ఉక్కు రంగంలో మేము 50 సంవత్సరాలకు పైగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాము. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు పరిశ్రమలో విశ్వసనీయమైన TMT స్టీల్ రాడ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేయబడ్డాయి హై-ఎండ్‌లో ఉపయోగించడానికి అనువైనవి.. నిర్మాణ ప్రాజెక్టులు ఇవి అత్యంత మన్నికైనవని” తెలిపారు.

Show comments