NTV Telugu Site icon

Vijay Devarakonda : మ్యూజిక్ ఆల్బమ్ తో రాబోతున్న విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్

New Project 2024 11 07t094701.823

New Project 2024 11 07t094701.823

Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తెలుగు సినిమా రంగంలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. వరుసగా హిట్లతో మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో కొన్ని డిజాస్టర్లు పడడంతో కొంత తగ్గినా సరికొత్త ప్రయోగాలతోనే ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇక తనకి ఉన్న సినిమాలతో బిజీగా ఉండగానే తాజాగా సంగీత రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ జస్లీన్ రాయల్‌తో చేస్తున్న స్పెషల్ మ్యూజిక్ అల్బమ్. ఈ కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో జస్లీన్ రాయల్‌తో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా జాయిన్ అవుతున్నారు. జస్లీన్ ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు. వీటిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, జస్లీన్ రాయల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆ ఆల్బమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఫోటోకు సంబంధించిన అప్డేట్ ను నవంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు జస్లీన్ రాయల్ హింట్ ఇచ్చారు.

Read Also:AUS vs IND: ఆస్ట్రేలియా పెద్ద ప్లానింగే.. బుమ్రాను టార్గెట్ చేసిందిగా!

జస్లీన్ రాయల్ తన గత సంగీత ప్రాజెక్ట్ ‘హీరియే’ పాటతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయడం తెలుగు ప్రేక్షకుల్లో కొత్త అంచనాలను నెలకొల్పుతోంది. జస్లీన్ రాయల్ తన ఫోటోలో “నా సూపర్ స్టార్ ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్‌తో గ్లోబల్ చార్ట్‌బస్టర్ ‘హీరియే’ను రూపొందించాను. మీరందరూ చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు మా వెనుక ఎవరున్నారు?” అంటూ ఇదివరకే ఒక ఫొటో వదిలారు. ఇక ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ అంటూ హింట్ చేశారు. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, నవంబర్ 15న విడుదల కానున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్ అన్ని వర్గాల్లో ప్రేక్షకుల అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్తుందని తను నమ్మకంగా ఉంది. విజయ్ దేవరకొండ తన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో కనిపించడం అభిమానులకు సరికొత్త అనుభూతిని అందజేస్తుంది. ముఖ్యంగా, జస్లీన్ రాయల్ వంటి టాలెంటెడ్ హంట్ సంగీతాన్ని అందిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో విజయ్ దేవరకొండ తన క్రియేటివిటీని కొత్త కోణంలో ప్రదర్శించబోతున్నాడని అనిపిస్తోంది.

Read Also:Cardiac Arrests: గుండెపోటుకు గురికాకూడదనుకునే వారు వీటిని అలవాటు చేసుకోవాల్సిందే

Show comments