NTV Telugu Site icon

Japan: చేయని తప్పుకు 58 ఏళ్ల జైలు శిక్షఅనుభవించిన వ్యక్తి.. పోలీస్ చీఫ్‌ క్షమాపణలు

Japan

Japan

ఓ కేసులో సాక్ష్యాలు తారుమారవ్వడంతో ఓ వ్యక్తి దాదాపు 58 ఏళ్లు జైల్లో మగ్గారు. సుదీర్గ న్యాయపోరాటం తర్వాత 88ఏళ్ల వయసులు ఆయన నిర్దోషి అని తేలింది. దీంతో తాము చేసిన తప్పుడు ఆయన ఇన్నేళ్లు జైలు జీవితాన్ని అనుభవించడంపై పోలీస్ చీఫ్ క్షమాపణ చెప్పారు. అసలేం జరిగిందంటే.. 1966లో ఓ మ‌ర్డర్ కేసులో ఐవా హ‌క‌మ‌డా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై మరణ శిక్ష కూడా విధించారు. కానీ ఆయన ఈ కేసులో అత్యున్నత కోర్టును ఆశ్రయించ‌డంతో మూడు ద‌శాబ్ధాల పాటు వాద‌న‌లు కొనసాగాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పున‌ర్ ద‌ర్యాప్తునకు కోర్టు అంగీక‌రించింది.

READ MORE: BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త లోగోతో పాటు ఫీచర్లు వచ్చేశాయ్!

దీంతో 2014లో మ‌ళ్లీ ఆయనపై నమోదైన కేసును మళ్లీ దర్యాప్తు చేశారు. ఈసారి నిర్వహించిన విచార‌ణ‌లో హ‌క‌మ‌డా నిర్దోషి అని తేలింది. సుమారు 58 ఏళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఆయనను కోర్టు నిర్దోషిగా విడుద‌ల చేసింది. ఈ మ‌ధ్యే ఇంటికి చేరుకున్న హ‌క‌మ‌డాకి ఆ జిల్లా పోలీసు చీఫ్ క్షమాప‌ణ‌లు చెప్పారు. విచార‌ణ‌లో పొర‌పాటు జ‌రిగిన‌ట్లు తెలిపారు. మా వ‌ల్ల నీకు తీవ్రమైన మాన‌సిక క్షోభ మిగిలింద‌ని, అది మాటల్లో చెప్పలేమ‌ని, దానికి సారీ చెబుతున్నట్లు ఆ పోలీసు బాసు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిర్దోషి వయసు 88 ఏళ్లు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు పోలీసు వ్యవస్థపై ఫైర్ అవుతున్నారు. గడిచిన 58 ఏళ్లను వెనక్కి తీసుకొస్తారా? ఒక్క సారీ చెబితే సరిపోతుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

READ MORE: High Court: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా..